AP PMAY Housing Loan Faults
పేదల ఇళ్ళ లోన్ తీసుకున్న ఆడవాలకి ఇంకా ఏ లోను రాదు...
ప్రధామంత్రి ఆవాస్ యోజన్ కోసం మన అందరికీ కొత్తగా తెలియాల్సిన అవసరం లేదు.
పేదలందరికీ పక్క ఇళ్ళు ఉండాలి అని దృఢ సంకల్పంతో మొదలుపెట్టిన పథకం అది.
అందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే పేర్లను(Ex:Ntr Nagar,YSRHousingScheme{నవరత్నాలు}) పెట్టీ ప్రాజెక్ట్ ను నడిపిస్తున్నారు.
A house of 430 sq.ft. will cost ₹ 7.71 Lakh
A house of 365 sq.ft. cost ₹ 6.74 Lakh
A house of 300 sq.ft. will cost ₹ 5.62 Lakh
subsidy of ₹ 1.50 Lakh is given to the beneficiaries of the Rural Housing scheme.(పల్లెటూరు వాళ్ళకి 1.50 లక్షలు సబ్సిడీ)
An additional ₹ 50,000 is given to the SC/ST beneficiaries. (షెడ్యూలు వారికి 50000 అధికంగా సబ్సిడీ)
A subsidy of ₹ 2.50 Lakh is provided to the beneficiary of PMAY Urban scheme.(పట్టణాలు నగరాలు లో ఉండేవారికి 2.50లక్షలు సబ్సిడీ)
ఎవరు ఎంచుకున్న గృహ విస్తీర్ణం బట్టి ఆయా వారికి ప్రభుత్వ సబ్సిడీ పోను మిగతాది లోను రూపంలో నెలకి కొంత వాయిదా(EMI) చొప్పున 20 సంవత్సరాలు కట్టాలి అని నిర్ణయించడం జరిగింది.
మీరు గమనించాల్సింది ఇక్కడి నుండీ..!
ఇక్కడ ప్రతీ ఆడపడుచు పేర్ల మీద లోన్ ఇవ్వడం జరిగి రెండు సంవత్సరాలు అయ్యింది అంటే డిసెంబర్ 2018 న లోన్ ఇవ్వడం జరిగింది.
అంటే రెండు పై మాటే..
ఇప్పటి వరకు(నవంబర్ నెల) 24 వాయిదాలు గాను 9 వాయిదాలు మాత్రమే చెల్లించడం జరిగింది అది కూడా అప్పుడప్పుడు, ఇంకా 15వాయిదాలు పెండింగ్ లో ఉన్నాయి. దీని వలన ఋణ గ్రహీతల CIBIL Score(అది 750 పైన ఉంటేనే చక్కని లోను వస్తుంది) దెబ్బ తినడం జరిగింది. దీని వలన భవిష్యత్తు లో అవి సక్రమంగా కట్టిన వరకు మిగతా లోన్లు వేటికి మీరు అర్హులు కారు(ప్రభుత్వ పథకాలకు మినహా)
మీకు పైన దీనికి సంబంధించిన ఫైల్ ఫోటో ఒకటి పెట్టడం జరిగింది.
ఇది చాలా మందికి తెలియదు అని నేను అనుకుని ఈ విషయం అందరికి తెలిసేలా ఈ పోస్టు పెట్టడం జరిగింది.
ప్రభుత్వం వలన జరిగిన ఏ ఒక్క లాస్ అయినా ప్రభుత్వమే భర్తీ చేయాలి.
ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వము అయినా ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలి అని కోరుకుందాం..
గమనిక: నాకు దొరికిన కొన్ని ఆధారాలు తో నేను ఈ పోస్టు రాయడం జరిగినది,ఇది పూర్తిగా నా ఆలోచనల నుండి వచ్చినది మాత్రమే
Source: Tik Tok Nature Team
Admin:Mady
No comments:
Post a Comment