Wednesday, 17 February 2021

మీరు బరువు పెరుగుతున్నారా.. అయితే త్వరగా తగ్గకపోతే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు

Can Obesity Kill You Early?

ఎన్నో వర్కౌట్ ప్లాన్స్, డైట్స్ రాత్రికి రాత్రే బరువు తగ్గిస్తామని చెప్తాయి. అయితే ఇక్కడ అర్ధం చేసుకోవలసినది ఏమిటంటే వెయిట్ లాస్ తో పాటూ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని. ఇక్కడ మీరు మరీ త్వరగా బరువు తగ్గితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వివరంగా తెలుసుకోండి.


Obesity
Obesity Is Dangerous
 త్వరగా బరువు తగ్గడమనే ఐడియా చాలా బావుంటుంది, టెంప్టింగ్ గా ఉంటుంది. అయితే, ఈజీగా లభించేవి కొన్ని సార్లు సరైనవి కాకపోవచ్చు. మనందరికీ తెలుసు, వెయిట్ లాస్ కొద్దిగా కాంప్లెక్స్ ప్రాసెస్ అని. వెయిట్ లాస్ వల్ల వచ్చే మార్పులని తట్టుకోవటానికి బాడీకి కొంత టైమ్ పడుతుంది. తక్కువ సమయం లో ఎక్కువ బరువు తగ్గడం కానీ, ఎక్స్ట్రీం మెజర్స్ తీసుకోవడం కానీ చేయడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బ తినడమే కాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.


1. తగ్గిన బరువు పెరగవచ్చు..

త్వరగా బరువు తగ్గితే ఆ తగ్గిన బరువు లోనే ఎక్కువ కాలం ఉండలేరు. చాలా మంది మొదట్లో ఉన్న బరువుకి త్వరగానే చేరుకుంటారు. ఒక్కోసారి ఇంకా ఎక్కువ బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. కొంత మంది కొంత బరువు తగ్గాక ఇంక అక్కడ ఆగిపోతారు. మెటబాలిక్ రేట్ స్లో గా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. మీరు తగ్గిన బరువుని మెయింటెయిన్ చేయాలంటే మీ ఆహారం లో జీవన శైలి అలవాట్లలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం అవసరం.

2. మెన్స్ట్రువల్ సైకిల్ లో తేడాలు..

హఠాత్తుగా, లేదా చాలా ఎక్కువగా వెయిట్ తగ్గడం వల్లన మీ హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యి ఆ ఎఫెక్ట్ మీ మెన్స్ట్రువల్ సైకిల్ మీద పడే అవకాశం ఉంది. రోజూ వారీ క్యాలరీ ఇన్‌టేక్ లో నుండి మరీ ఎక్కువ క్యాలరీలు తగ్గిస్తే ఓవులేషన్ కి అవసరమయ్యే హార్మోన్స్ యొక్క ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇలా జరిగిందంటే అర్ధం మీరు ఉండవలసిన బరువు కన్నా తక్కువ ఉన్నారనీ, కొంత బరువు పెరగాలనీ.



3. పోషకాహార లేమి..

కొన్ని ఫ్యాన్సీ వెయిట్ లాస్ ప్లాన్స్ త్వరగా ఫలితాలని ఇస్తామని చెప్పుకుంటాయి. ఈ ప్లాన్స్ లో మీరు ఒక ఫుడ్ గ్రూప్ ని పూర్తిగా పక్కన పెట్టేయవలసి ఉంటుంది. కానీ, ఇందులో ఒక చిన్న సమస్య ఉంది. అదేమిటంటే మనం తినే ప్రతి ఆహార పదార్ధం లోనూ కొన్ని పోషకాలు ఉంటాయి. ఒక ఫుడ్ గ్రూప్ ని పూర్తిగా పక్కన పెట్టేయటం వలన ఆ బేసిక్ న్యూట్రియెంట్స్ బాడీకి అందకుండా పోతాయి. కొన్నాళ్ళ తరువాత ఇది నీరసానికీ, కొన్ని అనారోగ్య సమస్యలకీ దారి తీస్తుంది.

4. మజిల్ మాస్ కోల్పోవచ్చు..

త్వరగా బరువు తగ్గడం అంటే అర్ధం తగ్గకూడని బరువు తగ్గడం. మీరు మరీ తక్కువ క్యాలరీలు తీసుకుంటే మీ బాడీ మజిల్ నుండి శక్తిని గ్రహిస్తుంది. మజిల్ లాస్ వెయిట్ లాస్ కాదు. మీరు ఎక్కువ మజిల్ బిల్డ్ అప్ చేయాలి, అప్పుడే ఎక్కువ క్యాలరీలు తగ్గగలుగుతారు.

5. డిప్రెషన్ వచ్చే అవకాశం..

శరీరంలో హఠాత్తుగా జరిగే మార్పులు మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తాయి. త్వరగా బరువు తగ్గడం కొరకు చాలా తక్కువ క్యాలరీలు తీసుకుంటారు, ఎక్కువ తినేస్తామేమో అన్న భయం తో ఎవరినీ కలవరు, ఫ్రెండ్స్ తో కలిసి బయటకి వెళ్ళరు... ఇవన్నీ కలిపి మెంటల్ హెల్త్ మీద దెబ్బ కొడతాయి.



అయితే, హెల్దీ వెయిట్ లాస్ కోసం ఏం చేయాలో ఇక్కడ ఉంది చూడండి.

1. ఎక్కువ ప్రొటీన్ తీసుకోండి

హై ప్రోటీన్ డైట్ మీ మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది. ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉండేట్లు చేస్తుంది. మీ మజిల్ మాస్ ని ప్రిజర్వ్ చేస్తుంది.

2. షుగర్, స్టార్చ్ తగ్గించండి
లో కార్బ్ డిఎట్ తీసుకునే వారు ఎక్కువ వెయిట్ తగ్గుతారని రీసెర్చ్ చెబుతోంది. మీ డైట్ లో షుగర్, స్టార్చ్ తగ్గించడం వల్ల మీ కార్బ్ ఇన్‌టేక్ కూడా తగ్గుతుంది.

3. నెమ్మదిగా తినండి
మీరు నెమ్మదిగా మీరు తీసుకునే ప్రతి ముద్దా నమిలి తింటే తక్కువ తింటారు, ఎక్కువ సేపు మళ్ళీ ఆకలి కాకుండా ఉంటుంది.

4. గ్రీన్ టీ లేదా ఊలాంగ్ టీ తాగండి
గ్రీన్ టీ మీ మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది. మీరు కొవ్వు కరిగించే ప్రాసెస్ ని కూడా స్పీడప్ చేస్తుంది.

5. విశ్రాంతి తీసుకోండి
చాలినంత నిద్ర లేనప్పుడు ఆకలి వేస్తుంది. ఆటోమ్యాటిక్ గా ఏదైనా తినేస్తాం. పైగా రాత్రి డిన్నర్ తరువాత ఆకలి వేసిందనుకోండి, అప్పుడు హెల్దీ ఫుడ్ తినే ఛాన్స్ తక్కువ. ఫలితం బరువు పెరగడం. కాబట్టి, బరువు తగ్గాలంటే మాత్రం కంటి నిండా నిద్ర పోవాలని నిపుణులు చెబుతున్నారు.

6. రెసిస్టెన్స్ ట్రెయినింగ్ ట్రై చేయండి
రెసిస్టెన్స్ ట్రెయినింగ్, లేదా లిఫ్టింగ్ వెయిట్స్ మజిల్ లాస్ జరగకుండా చూస్తాయి. అందువల్ల మజిల్ లాస్ వల్ల వచ్చే మెటబాలిజం స్లో డౌన్ అయిపోవడం అనే సమస్య రాకుండా ఉంటుంది.



7. హై ఇంటెన్సిటీ వర్కౌట్ ట్రై చేయండి
హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రెయినింగ్ (హెచ్ఐఐటీ) లో చిన్న, ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. కార్డియో అని పిలవబడే రెగ్యులర్ ఎక్సర్సైజ్ లా కాకుండా హెచ్ఐఐటీ వర్కౌట్ తరువాత కూడా క్యాలరీలను కరిగిస్తూనే ఉంటుంది.

8. సాల్యుబుల్ ఫైబర్ తీసుకోండి
సాల్యుబుల్ ఫైబర్ వల్ల ఫ్యాట్ ఎక్కువగా కరుగుతుంది. ప్రత్యేకించి పొట్ట చుట్టూ కొవ్వు కరగడానికి ఈ ఫైబర్ బాగా హెల్ప్ చేస్తుందని అంటారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు


No comments:

Post a Comment