Monday, 22 February 2021

AP Panchayat Elections Final and Exact Results | నాలుగు విడతల జిల్లా వారీగా ఫలితాలు

AP Panchayat Elections: నాలుగు విడతల ఫైనల్ రిజల్ట్స్ ఇవే? గెలుపుపై ఎవరి లెక్కలు వారివే? వాస్తవమేంటి? 
Panchayat Elections Image
పంచాయతీ ఎలక్షన్ ఫోటో ఫైల్


ఏపీ పంచాయతీ నాలుగు దశల ఎన్నికలు ముగిసాయి. సాధరణ ఎన్నికలను తలపించేలా జరిగిన ఈ ఎన్నికల్లో చాలాచోట్ల ఘర్షణలు, వాగ్వాదాలు దర్శనమిచ్చాయి.. మొత్తం నాలుగు విడతలను పరిశీలిస్తే కొన్ని చోట్ల చెదరుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే ఎన్నికలు జరిగాయని చెప్పాలి.

అధికార పార్టీ అయితే ప్రజాస్వామ్యం నెగ్గిందని.. అన్ని ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కనిపించదని అంటోంది. విపక్షాలు మాత్రం అరాచకాలతో ఫలితాలు సాధించారని.. ప్రతిపక్షాలు నెగ్గిన చోట కూడా.. వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చేలా అధికారులను బెదిరించారంటూ ఆరోపిస్తున్నాయి. ఎవరి వాదన ఎలా ఉన్నా నాలుగు విడతల్లోనూ అధికారులు ప్రకటించిన ఫలితాల బట్టి చూస్తే వైసీపీ హవా స్పష్టంగా కనిపించింది.

దాదాపు అన్ని జిల్లాలోనూ 70 శాతానికి పైగా సీట్లు అధికార పార్టీ మద్దతు దారులే గెలిచారు.

ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఒకటి రెండు జిల్లాలు మినహా ఎక్కడా గట్టి పోటీ ఇవ్వలేదని చెప్పాలి. సీఎం సొంత జిల్లా కడపలో అయితే టీడీపీ మద్దతు దారులు కనీసం సెంచరీ కొట్టలేకపోయారు. ఇక జనసేన ఉభయగోదావరి జిల్లాల్లో తప్పా ఎక్కడా ప్రభావం చూపించలేదు.. మిగిలిన పార్టీల మద్దతు దారులకు చాలా వరకు డిపాజిట్లే దక్కలేదు..

నాలుగు విడతల్లో మొత్తం తుది ఫలితాలు ఇవే:

వైసీపీ మద్దతుదారులు 10,299

టీడీపీ మద్దతుదారులు 2,166

జనసేన మద్దతుదారులు 157

బీజేపీమద్దతుదారులు 45

ఇతరులు 414

జిల్లాల వారిగా ఫలితాలు ఇలా ఉన్నాయి

శ్రీకాకుళం : వైసీపీ 950 టీడీపీ 199 జనసేన 3 బీజేపీ 2 ఇతరులు 10

విజయనగరం : వైసీపీ741 టీడీపీ 157 జనసేన 1 బీజేపీ 3 ఇతరులు 52

విశాఖ : వైసీపీ 684 టీడీపీ 184 జనసేన 12 బీజేపీ 5 ఇతరులు 74

తూర్పు గోదావరి : వైసీపీ 803 టీడీపీ 159 జనసేన 48 బీజేపీ 1 ఇతరులు 58

పశ్చిమ గోదావరి : వైసీపీ 646 టీడీపీ 173 జనసేన 51 బీజేపీ 2 ఇతరులు 20

కృష్ణా : వైసీపీ 705 టీడీపీ 181 జనసేన 20 బీజేపీ 0 ఇతరులు 52

గుంటూరు : వైసీపీ730 టీడీపీ 191 జనసేన 19 బీజేపీ 5 ఇతరులు28

ప్రకాశం : వైసీపీ 821 టీడీపీ 171 జనసేన 0 బీజేపీ 0 ఇతరులు 18

కర్నూలు : వైసీపీ 764 టీడీపీ 177 జనసేన 0 బీజేపీ1 ఇతరులు 27

అనంతపురం : వైసీపీ 835 టీడీపీ 191 జనసేన 0 బీజేపీ 0 ఇతరులు14

కడప : వైసీపీ 686 టీడీపీ 73 జనసేన 1 బీజేపీ 16 ఇతరులు 13

నెల్లూరు :వైసీపీ777 టీడీపీ 123 జనసేన 0 బీజేపీ 6 ఇతరులు 29

చిత్తూరు : వైసీపీ 1157 టీడీపీ 187 జనసేన 2 బీజేపీ 4 ఇతరులు 19

నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 శాతం స్థానాలకు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయన్నారు. సుమారు 10,890 మంది సర్పంచులు, 47,500 మంది వార్డు మెంబర్లు నేరుగా ఎన్నికైనట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో యంత్రాంగం అంకితభావంతో పని చేసిందని కితాబిచ్చారు. ప్రతి విడతలో 80 శాతానికి పైగా స్వచ్ఛందంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ముందుగా భావించామని, అయితే కోర్టులో కేసుల కారణంగా కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని ఎస్‌ఈసీ అన్నారు. అవాంతరాలు తొలిగి పోయాక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మార్చి 2 నుంచి పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. పట్టణ ఓటర్లు కూడా పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఒత్తిడితో నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి విజ్ఞప్తులపై చర్చిస్తున్నామని.. వాటిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామన్నారు.



Source : "News18 తెలుగు"


Friends, If You Like this post kindly comment below the post and do share your valuable response.
Thanks&Regards, 
Tik Tok Nature Team

No comments:

Post a Comment