తనకి కాబోయే భర్త పెంపుడు కుక్కను ఇష్టపడకపోవడంతో ఓ యువతి ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్న వింత సంఘటన కర్నాటక రాజధాని బెంగుళూరులో జరిగింది. బెంగుళూరుకు చెందిన కరిష్మా వాలియాకు రిష్తా అనే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరింది. స్వతహాగా జంతువులంటే ఎంతో ఇష్టమున్న కరిష్మా వాలియాకు తన పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టం.
పెళ్లి తర్వాత కూడా కుక్కను తన వద్దే ఉంచుకుంటానని కాబోయే భర్తతో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ చాట్ చేస్తూ అతడితో చెప్పింది. అయితే అతడు తనకు కుక్కలు అంటే ఇష్టం లేదని చెప్పాడు. తన తల్లికి కూడా కుక్కలంటే ఇష్టొం లేదని, తమ ఇద్దరి మధ్య కుక్క ఎందుకని ప్రశ్నించాడు. దీంతో మన పెళ్లి జరగదని కరిష్మా అతడితో తెగేసి చెప్పింది. సీరియస్ గా చెబుతున్నావా? అని ప్రశ్నించగా అవుననే సమాధానమిచ్చింది. మనిద్దరి జీవితం ముఖ్యమని, కుక్కతో నీ అనుబంధం తాత్కాలికమేనన్న అతడి వాదనతో ఆమె ఏకీభవించలేదు.
అంతేకాదు కుక్కతో తన అనుబంధం తాత్కాలికమే అయినా, తన పెంపుడు కుక్కను పెళ్లి కోసం వదులుకోలేనని తేల్చిచెప్పింది. పెళ్లి తర్వాత దీని కారణంగా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాకుడదనే ఉద్దేశంతోనే ఈ పెళ్లి జరగదని సృష్టం చేసింది.
దీంతో కోపద్రిక్తుడైన ఆ కాబోయే పెళ్లి కొడుకు నీ కుక్కనే పెళ్లి చేసుకో అని సమాధానమిచ్చాడు. ఈ విషయం పై ఇద్దరి మధ్య వాదనలు అవసరమని కరిష్మా సూటిగా చెప్పడంతో అక్కడితో వాట్సప్ చాట్లో వారిద్దరి మాటలకు బ్రేక్ పడింది. కుక్క కారణంగా ఓ పెళ్లి రద్దైన ఈ వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరూ కరిష్మా నిర్ణయం పై హర్షం వ్యక్తం చేయగా, మరి కొందరూ రిష్తా వాదనకు మద్దతు పలకడం విశేషం.
No comments:
Post a Comment